Share News

1,200 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని కొన్నాం

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:12 AM

కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల నుంచి 1200 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు తెలిపారు.

1,200 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని కొన్నాం
అమ్మకానికి ఉంచిన మార్క్‌ఫెడ్‌ ఉల్లి

మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల నుంచి 1200 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు తెలిపారు. ఆదివారం కర్నూలు మార్కెట్‌ యార్డులో జంబో మార్కెట్‌ గోదాములోని ఉల్లి నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గోదాములో నిల్వ ఉంచిన ఉల్లిని త్వరగా బయటకు సప్లయ్‌ చేసే కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమ్మకానికి వేలం నిర్వహించామన్నారు. ఈవేలంలో హోటళ్లు, విద్యాసంస్థల హాస్టళ్లు తదితర సంస్థల యజమానులు 150 టన్నుల దాకా ఉల్లిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇకపై వేలం పాటలను నిరంతరం నిర్వహించి రైతుల నుంచి సేకరించిన ఉల్లిని అమ్మేందుకు నిర్ణయించామని స్పష్టం చేశారు.

Updated Date - Sep 08 , 2025 | 01:12 AM