పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - May 18 , 2025 | 12:52 AM
పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’లో భాగంగా శనివారం పాణ్యంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కలెక్టర్ రాజకుమారి
పాణ్యం, మే 17 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’లో భాగంగా శనివారం పాణ్యంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్లో మండల మహిళా సభ్యులతో కలిసి చెత్తాచెదారం తొలగించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలను పెంచడమే గాక వాటి సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లాలో మొట్టమొదట హె వీ లైసెన్స్ పొందిన లక్ష్మీదేవిని కలెక్టర్ అభినందించారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం గంగాధర్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీపీ ఉశేన్‌బీ, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వరగౌడ్, ఆర్‌ఎం రజియాసుల్తానా, పంచాయతీ కార్యదర్శి ఆనందరావు, పాల్గొన్నారు.
టీడీపీ నాయకుడు వేధిస్తున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు
మండలంలోని సుగాలిమెట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తిరిపాలు నాయక్ నిత్యం తనను వేధిస్తున్నాడని సచివాలయ ఏఎన్‌ఎం ఫరీదా కలెక్టరుకు కన్నీటితో మొరపెట్టుకున్నారు. ఇంటి వద్దకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఫోన్‌లో వేధిస్తున్నాడని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. కలెక్టరు స్పందించి తిరిపాలునాయక్‌ను విచారించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.