స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:45 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి బూత, యూనిట్ ఇనచార్జిలు, క్లస్టర్ కన్వీనర్లు సిద్ధం కావాలని టీడీపీ నాయకుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.
టీడీపీ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి
డోన టౌన, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి బూత, యూనిట్ ఇనచార్జిలు, క్లస్టర్ కన్వీనర్లు సిద్ధం కావాలని టీడీపీ నాయకుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బూత, క్లస్టర్ కన్వీనర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కోట్ల రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ బూత, యూనిట్ ఇనచార్జిలు, క్లస్టర్ కన్వీనర్‌లు క్రమశిక్షణతో పని చేస్తే డోన నియోజకవర్గంలో టీడీపీ స్పష్టమైన విజయం సాధించడం ఖాయమన్నారు. అలాగే విభిన్న నియోజకవర్గాల నుంచి వచ్చిన అబ్జర్వర్లు కార్యక్రమంలో పాల్గొని బూ తల పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫణిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన కోట్రికే హరికిషన, నియోజకవర్గ అబ్జర్వర్ కేసీ హరి, రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణరెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కే.చిన్న వెంకటస్వామి, ఏపీ యాదవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన సభ్యులు కే.వెంకటేశ్వర్లు యాదవ్, ఉలింద కొండ పీఏసీఎస్ చైర్మన ఈవీ రమణ, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన సభ్యులు బోయ మహేష్ నాయుడు, కల్లూరు పీఏసీఎస్ చైర్మన డి.శేఖర్, పీఏసీఎస్ పగిడ్యాల చైర్మన డి.దామోదర్ రెడ్డి, పీఆర్ సాబ్‌పేట పీఏసీఎస్ చైర్మన ఆర్.వెంకటేశ్వరరెడ్డి, మద్దూరు పీఏసీఎస్ చైర్మన కే.జనార్దన రెడ్డి, నంద్యాల ఏఎంసీ చైర్మన గుంటుపల్లి హరి బాబు, రాష్ట్ర కార్యదర్శి చల్లా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.