స్థానిక సంస్థలఎన్నికలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:41 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో పోటీకి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
మంత్రాలయం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో పోటీకి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. శనివారం మండలంలోని కల్లుదేవకుంట బాపురే ఫాంహౌస్ మైదానంలో సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాలను బీజేపీ రాష్ట్రనాయకుడు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురు షోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రాలయం సర్కిల్‌లో విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. ముఖ్యఅతిథులుగా మంత్రాలయం జనసేన ఇన్‌చార్జి, ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్న, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, బీజేపీ రాష్ట్ర విమోచన అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, విట్టరమేష్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీనాయుడును ఘనంగా శాలువా, పూలమాలలతో సన్మానిం చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన నాయకులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపించారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు, బెదింపులకు భయపడేది లేదని పురు షోత్తంరెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు జగ్గాపురం చిన్నఈరన్న, సత్యనారాయణరెడ్డి, మాలతి, రమేష్, గురురాజ్ దేశాయ్, దయాకర్, లలితకుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.