Share News

ఎమ్మిగనూరు జిల్లా కావాలి..

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:39 PM

ఆదోని జిల్లా కావాలని మా ఎమ్మిగనూరులో ఎవరు నన్ను అడగలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి బదులిచ్చారు.

ఎమ్మిగనూరు జిల్లా కావాలి..
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మిగనూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా కావాలని మా ఎమ్మిగనూరులో ఎవరు నన్ను అడగలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి బదులిచ్చారు. శనివారం ఎమ్మిగనూరు మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదోని జిల్లా డిమాండ్‌పై మాట్లాడుతూ నా స్వార్థం నాది ఎమ్మిగ నూరు జిల్లా కావాలని నాకు ఉంది. మా వాళ్లు నన్ను అదే అడుగుతున్నారు. మావాళ్ల ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తా. ఆదోని జిల్లా ఏర్పడిన పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే దూరంలో కాస్త తగ్గుతుందన్నారు. ఈఅంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎంతో చర్చిస్తామన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:39 PM