ప్రజలకు సేవలందించాలి : మంత్రి బీసీ
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:55 PM
ప్రజల సమస్యల ను పరిష్కరించి వారికి మెరుగైన సేవలందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
బనగానపల్లె, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల ను పరిష్కరించి వారికి మెరుగైన సేవలందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి బీసీ అర్జీలను స్వీకరిం చారు. బీసీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 16వ వార్డు లోని రాంభూ పాల్‌నగర్‌లో మౌలిక సదూపాయాలు కల్పించాలని కాలనీవాసులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.