Share News

పత్తిని కొనాల్సిందే...

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:14 PM

రైతులు పండించిన అన్ని రకాల పత్తిని సీసీఐ అధికారులు కొనాలని ఏఐకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హనుమంతు డిమాండ్‌ చేశారు.

పత్తిని కొనాల్సిందే...
రాస్తారోకో చేస్తున్న రైతుసంఘం నాయకులు

ఏఐకేఎస్‌ డిమాండ్‌

జాతీయ రహదారిపై రాస్తారోకో

ఎమ్మిగనూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన అన్ని రకాల పత్తిని సీసీఐ అధికారులు కొనాలని ఏఐకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హనుమంతు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పత్తి రైతులకు మద్దతుగా పట్టణ శివారులోని మంత్రాలయం రోడ్డులో శివమూర్తి జిన్నింగ్‌ ఫ్యాక్టరి దగ్గర జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సీసీఐకి అమ్మకానికి తెచ్చిన పత్తిని ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్నారు. పత్తి సరిగాలేదని తిప్పి పంపితే సహించేది లేదన్నారు. పత్తి రైతులను ఆదుకోవాల్సి బాధ్యత సీసీఐ అధికారులదేనన్నారు. ఇప్పటికైనా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి రైతునుంచి పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనరసయ్య, అబ్దుల్లా, గోనెగండ్ల మండల అధ్యక్షుడు నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:15 PM