Share News

కడసారి చూపునకు నోచుకోలేకపోయాం

ABN , Publish Date - May 28 , 2025 | 12:12 AM

ఎప్పుడో 22 ఏళ్ల క్రితం తమ కుమార్తె లలిత మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిందని, తామంతా మిస్సింగ్‌ అయ్యిందని, ఎక్కడో ఓ చోట ఉండి ఉంటుం దని అనుకున్నామని ములుగుందం గ్రామానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ఎస్తేరమ్మ, గోనెగండ్ల దుబ్బన్న, తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కడసారి చూపునకు నోచుకోలేకపోయాం
కన్నీరుమున్నీరవుతున్న లలిత తల్లిదండ్రులు, బంధువులు

మావోయిస్టు లలిత కుటుంబ సభ్యుల ఆవేదన

ఆస్పరి, మే27(ఆంధ్రజ్యోతి): ఎప్పుడో 22 ఏళ్ల క్రితం తమ కుమార్తె లలిత మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిందని, తామంతా మిస్సింగ్‌ అయ్యిందని, ఎక్కడో ఓ చోట ఉండి ఉంటుం దని అనుకున్నామని ములుగుందం గ్రామానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ఎస్తేరమ్మ, గోనెగండ్ల దుబ్బన్న, తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 22న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని నారాయణ పూర్‌ అడవుల్లో మావోయిస్టు లలిత అలియాస్‌ సంగీత పోలీసు కాల్పుల్లో మృతిచెందిందన్న సమాచారం కుటుంబసభ్యులకు తెలిసింది. నిరుపేదలమైన తాము లలితను ఎంతో ఆశతో చదివిం చామని, 22 యేళ్ల క్రితం ఏదో ఉద్యోగం చేసుకుంటానని వెళ్లిన కూతురు ఇక తిరిగి రాలేదని అన్నారు. విప్లవోద్యమంలో పని చేస్తూ చివరికి ఇలా మృత్యుఒడి చేరుకుంటుందని అనుకోలేదని ఆవేదన చెందారు. పోలీసులు మానవత్వంతో మృతదేహాన్ని అయినా ఇస్తారని తమ కొడుకులు వెళ్లారని, అయినా వారు దుర్మార్గంగా వ్యవహరించారని లలిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మా అమ్మ కోలుకోవడం కష్టం

మా నలుగురు తమ్ముళ్లకు ఊహ తెలియని వయసులోనే మా అక్క లలిత కుటుంబాన్ని విడిచి వెళ్లింది. ఎక్కడో ఓ చోట ఉంటుందని మా అమ్మ, నాన్నలు చెబుతూ వచ్చారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెం దిందన్న సమాచారం తెలియడంతో దిగ్ర్భాంతికి గురయ్యాం. మా అమ్మ అప్పటి నుంచి మంచం పట్టింది. మా అక్క మృతితో మా అమ్మ కోలుకోవడం కష్టంగా మారింది. కనీసం మృతదేహాన్ని అయినా చూసి దుఃఖాన్ని దిగమింగుకు న్నామన్న ఆశ కూడా లేకపోయింది. - ఎర్రప్ప, లలిత తమ్ముడు, ములుగుందం గ్రామం

Updated Date - May 28 , 2025 | 12:12 AM