Share News

డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:40 PM

మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించి 16,347 పోస్టులను భర్తీ చేశామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ గురువారం తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం
మంత్రి టీజీ భరత్‌

మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించి 16,347 పోస్టులను భర్తీ చేశామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ గురువారం తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఏటా డీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్యారంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికి అండగా నిలబడ్డామన్నారు. యువత బాగుండటం ఇష్టంలేక రాష్ట్రంలోని ఓ ప్రధాన పార్టీ నేత మెగా డీఎస్సీని ఆపడానికి కేసులు వేయించారని చెప్పారు. వాటన్నింటినీ ఎదుర్కొని డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ఘనత మంత్రి నారా లోకేశ్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగు పర్చేందుకు గత 14 నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ పాఠశాలలకు నూతన వెలుగులు తెస్తున్నామన్నారు. 2014-2019 మధ్య రెండుసార్లు డీఎస్సీ నిర్వహించి 18వేల ఉపాధ్యాయ పోస్టులను అప్పటి టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 729 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేసిందన్నారు. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించిందని, 700 కోయభారతి టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. జూనియర్‌ కళాశాల్లో 700 మంది సిబ్బంది సేవలను, 476 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో 3,619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పునర్ధురణ చేశామని చెప్పారు. టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు గత ప్రభుత్వంలో ఆరు రకాల బడుల విధానం ఉండగా .. తమ కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల బడులుగా మార్చిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చి దిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:40 PM