Share News

వీరుల త్యాగాలను మరువలేం

ABN , Publish Date - May 23 , 2025 | 12:52 AM

దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలే మని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

వీరుల త్యాగాలను మరువలేం
ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు

కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు శివారులో తిరంగా ర్యాలీ

కర్నూలు రూరల్‌ మే 22(ఆంధ్రజ్యోతి): దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలే మని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. గురువారం కర్నూలు నగర శివారులోని నందికొట్కూరు ప్రధాన రహదారిలో ఎమ్మెల్యే దస్తగిరితో పాటు టీడీపీ సీనియర్‌ నాయకులు విష్ణువర్దన రెడ్డి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి కమ్మసంఘం కల్యాణమండపం వరకు కొనసాగింది. కార్యక్రమంలో కోడుమూరు, గుడూరు, కర్నూలు, బెలగల్‌ మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:53 AM