Share News

రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పిస్తాం

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:42 AM

వ్యాసరచన, వక్తత్వ పోటీలతో విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించామని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పిస్తాం
విద్యార్థులతో నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

విజేతలకు బహుమతులు అందజేత

నంద్యాల నూనెపల్లె, నవంబరు26(ఆంధ్రజ్యోతి): వ్యాసరచన, వక్తత్వ పోటీలతో విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించామని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఆమె విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ పోటీలు నిర్వహించా మన్నారు. ప్రతి నియోజక వర్గం నుంచి మొత్తం ముగ్గురు విద్యార్థులను ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశామన్నారు. ఎంపికైన ఓఉత్తమ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు, ప్రశంసాపత్రం పొందగా మిగిలిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా స్థాయిలోనే అవార్డు, ప్రశంసాపత్రాలు అందజేశారన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:42 AM