సీఎం రీలీఫ్ ఫండ్‌తో ఆదుకుంటున్నాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:23 AM
సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు అండగా ఉన్నామని పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు
1.26 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు అండగా ఉన్నామని పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 27 మందికి సీఎం రిలీ్ పండ్ ద్వారా మంజూరైన 1,26,31,142 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఎల్లార్తి భీమ సేనకు రూ. 72,254, షేక్ ఫజురుల్ రహిమాన్ కు రూ. 1,29,231, జక్కుల పుష్పవతికి 1,15,630 సయ్యదా మోహ మదున్సీసాకు రూ. 81,030, దాసరి సులోచనకు రూ. 20 వేలు, షేక్ అబ్దుల్ హఫీజ్‌కు రూ. 77,063, ప్రతాప్‌కు రూ. 25 వేలు, ఆనంద్‌కు రూ. 32,167, షేక్ సమీరున్ సుల్తాన్ కు రూ. 86,390, రాచపూడి మనోహర్ కుమార్ రూ. 50,700, జయ చంద్రరాజుకు రూ. 63,457, షేక్ మహమ్మద్‌కు రూ. 30,123, రాచకొండ పద్మావతికి రూ. 68 వేలు, గూడురు ఆనంద్‌కు రూ. 1,23,078, షేక్ ఫాతీమాకు రూ. 30 వేలు, ఎం రవీంద్రరావుకు రూ. 30,123, షేక్ ఖాజా బాషాకురూ. 24, 776, సమీర్‌లక్ష్మి కళావతికి రూ.47,918, సల్మాన్ కు రూ. 1,52,619, భారతికి రూ. 69,152 అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని మంత్రి అన్నారు.