Share News

ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నాం : ఆర్డీవో

ABN , Publish Date - May 07 , 2025 | 12:39 AM

డివిజన్‌లోని అన్ని మండలాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తున్నామని ఆర్డీవో భరత్‌ నాయక్‌ అన్నారు.

ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నాం : ఆర్డీవో
ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలిస్తున్న ఆర్డీవో

మద్దికెర, మే 6 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌లోని అన్ని మండలాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తున్నామని ఆర్డీవో భరత్‌ నాయక్‌ అన్నారు. మంగళవారం పెరవలి గ్రామంలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. అనంతరం సచివాలయంలో రీసర్వే ఆన్‌లైన్‌ వివరాలను పరిశీలించారు. రీసర్వే వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులు రీసర్వేకు సహకరించాలన్నారు. వీఆర్వోలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలన్నారు. తహసీల్దార్‌ హుశేన్‌ సాహెబ్‌, సర్వేయర్‌ నరేంద్ర, వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:39 AM