Share News

పది రోజులకోసారి తాగునీరు

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:05 AM

తమ కాలనీల్లో పది రోజులకోసారి తాగునీరు వస్తోందని వెల్దుర్తికి చెందిన 1, 9వార్డు ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నా రు. బుధవారం పం చాయతీ కార్యాలయా నికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

పది రోజులకోసారి తాగునీరు
నిరసన తెలుపుతున్న ప్రజలు

వెల్దుర్తి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తమ కాలనీల్లో పది రోజులకోసారి తాగునీరు వస్తోందని వెల్దుర్తికి చెందిన 1, 9వార్డు ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నా రు. బుధవారం పం చాయతీ కార్యాలయా నికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో 20 వేల జనాభా ఉంది. ప్రజల తాగునీటి అవసరాలకు రోజుకు 10 లక్షల లీటర్ల నీరు అవసరం. కాగా బ్రహ్మగుండంలోని పులికుంట, పాతకొనేరు, బ్రహ్మేశ్వరమైన్స్‌ ప్రాంతాల నుంచి మూడు బోర్ల ద్వారా సంపుకు 9 లక్షల లీటర్లు, చెరుకులపాడు, తొగర్చేడులో రెండు బోర్ల ద్వారా డోన్‌ హైవే సంపుకు 9 లక్షల మేరకు మొత్తం 18 లక్షల లీటర్ల నీటిని సంపులకు నింపుతున్నారు.

నీరు ఉన్నా సరఫరాలో నిర్లక్ష్యం

సంపుల్లో తాగునీరు పుష్కలంగా ఉన్నా ఎందుకు రోజూ సరఫరా చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బోర్ల ద్వారా నీటిని వదిలే క్రమంలో వాల్వులు బంద్‌చేసి ఉంచడంతో నీటి ఒత్తిడికి వాల్వులు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తున్నారు కావాలనే ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తాగునీటి సరఫరా విషయంలో వాటర్‌మెన్లు అధికారుల ఆదేశాలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో కొందరి నాయకుల ఒత్తిడి కూడా ఉందని, అందుకే తాగునీరు సరఫరా కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం : లక్ష్మీనాథ్‌, పంచాయతీ కార్యదర్శి

తాగునీటి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. పంచాయతీలో తీర్మానం పెట్టి రోజూ నీరు వదలడానికి అవసరమైన ప్రక్రియ చేపడతాం.

Updated Date - Jun 26 , 2025 | 12:05 AM