Share News

కేసీకి నీరు విడుదల చేయాలి

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:48 PM

కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలంటూ కలెక్టర్‌ రాజకుమారికి రాయలసీమ సాగునీటి సాధనసమితి నాయకులు కోరారు.

కేసీకి నీరు విడుదల చేయాలి
వినతిపత్రం అందజేస్తున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు

రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలంటూ కలెక్టర్‌ రాజకుమారికి రాయలసీమ సాగునీటి సాధనసమితి నాయకులు కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా రాయలసీమ సాగునీటి సాధనసమితి నాయకులు వైఎన్‌ రెడ్డి, రాముబ్బారెడ్డి మాట్లాడారు. గతనెలలో అడపాదడపా వర్షాలు కురియ డంతో రైతులు కేసీ కెనాల్‌ కింద ఆరుతడి పంటలు సాగుచేశారని, ప్రస్తుతం పూత, పిందెదశల్లో ఉన్నాయన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడతో పంటలు ఎండే పరిస్థితి నెలకొందని కలెక్ట ర్‌కు వివరించారు. నీళ్లు ఉన్నప్పటికీ మరమ్మతుల పేరుతో జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేయడం లేదన్నారు. శనివారం జరిగే సాగునీటి సలహామండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నాయకులు రామకృష్ణారెడ్డి, పట్నం రాముడు, సుధాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:48 PM