జీడీపీ ఎడమ కాలువకు నీరు విడుదల
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:35 PM
గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో రబీ సీజన్‌లో పంటలు సాగు చేసుకునేందుకు గాను గురువారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు.
గోనెగండ్ల, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో రబీ సీజన్‌లో పంటలు సాగు చేసుకునేందుకు గాను గురువారం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. నీటి విడుదల పూజా కార్యక్రమంలో జీడీపీ సాగునీటి సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్, టీడీపీ మండలకన్వీనర్ తిరుపతయ్య నాయుడు పాల్గ్గొన్నారు. ఎడమ కాలువ ద్వారా ప్రస్తుతం రైతుల అవసర నిమిత్తం 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ కింద 3,500 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు 1300 నుంచి 1400 ఎకరాల లోపు సాగు కావచ్చునని అధికారులు చెబుతున్నారు. జేసీ నూరుల్ ఖమర్ ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు ఉంది?, ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు?, ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలు ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ప్రాజెక్టు విస్తరించి ఉంది? అని ఏఈ మహుమ్మద్ ఆలీని అడిగి తెలుసుకున్నారు. ఆయకట్టు రైతులకు రబీ సీజన్‌లో సాగునీటి సమస్య రాకుండు చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, ఉగ్రనరసింహుడు, హెచ్.కైరవాడి సహకార సంఘం అధ్యక్షుడు తిమ్మారెడ్డి, రాజేష్, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.