Share News

శ్రీశైలంలో 9 గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:37 PM

శ్రీశైలం రిజర్వాయరుకు వరద వచ్చి చేరుతుం డంతో 9 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,38,626 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంలో 9 గేట్ల ద్వారా నీటి విడుదల
శ్రీశైలం డ్యాంలో 9 గేట్ల ద్వారా విడుదల అవుతున్న నీరు

నీటి నిల్వ సామర్థ్యం 197 టీఎంసీలు

శ్రీశైలం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వాయరుకు వరద వచ్చి చేరుతుం డంతో 9 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,38,626 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల స్విల్‌వే నుంచి 1,23,768 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి అనంతరం 33,403 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 20,196 క్యూసెక్కులు మొత్తం 1,77,367 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం డ్యామ్‌ నీటిమట్టం 851.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 197 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలంలో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి అనంతరం 30,522 క్యూసెక్కులు, 30,315 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

Updated Date - Aug 29 , 2025 | 11:37 PM