Share News

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి గాజులదిన్నెకు నీరు విడుదల

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:39 PM

హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల విడుదల చేశారు.

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి గాజులదిన్నెకు నీరు విడుదల
హంద్రీనీవా నుంచి జీడీపీ కాల్వకు విడుదలవుతున్న నీరు

15 రోజులుగా ఎల్లెల్సీ నీరు నిలిపివేత

గోనెగండ్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల విడుదల చేశారు. ఆదివారం ఉదయం ఆ నీరు జీడీపీకి చేరనున్నాయి. రెండు రోజుల క్రితం హంద్రీనీవా అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టుకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విడుదలైన నీరు వాగులు, వంకల ద్వారా వృథాపోగా జీడీపీలోకి చేరేలోపు 130 క్యూసెక్కులు చేరనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలుపుతున్నారు. ఈఏడాది రబీ సీజన్‌కు నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ కింద దాదాపు 13వేల ఎకరాలు సాగు అవుతున్నట్లు తెలుస్తుంది. పంటలు చేతికి అందే వరకు సాగునీరు విడుదల చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. 15 రోజులుగా ఎల్లెల్సీ నీటిని జీడీపీలోకి మళ్లించడం నిలిపి వేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టులో 2.9 టీఎంసీలు..

ఎల్లెల్సీ నీటి విడుదల కూడా జనవరి 10తో ముగియనుంది. ఇక కేవలం హంద్రీ నీవా పథకం నుంచి వచ్చే నీటిపైనే జీడీపీ ఆధారపడాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.9 టీఎంసీ మాత్రమే ఉంది. జీడీపీ కింద సాగు చేస్తున్న 13వేల ఎకరాల పంట చేతికి అందేవరకు నీరు విడుదల కావాలంటే మార్చి నెల చివరి వరకు నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. జీడీపీ కింద బండగట్టు, డోన్‌, క్రిష్ణగిరి, కోడుమూరు, కర్నూలు, గూడూరు, సి.బెళగల్‌లో తాగునీటి పథకాలు ఉన్నాయి. దీంతో పాటు హంద్రీ పరిసర గ్రామాలకు రింగ్‌ బోర్ల ద్వారా తాగునీరు అందించాల్సి ఉంది. హంద్రీనీవా తప్ప మరో మార్గం లేదు.

Updated Date - Nov 22 , 2025 | 11:39 PM