Share News

ఒక గేటుతో నీటి విడుదల

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:39 PM

శ్రీశైలం జలాశయంలో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఒక గేటును 10 అడుగు ఎత్తు మేరకు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు.

ఒక గేటుతో నీటి విడుదల
ఒక గేటుతో కొనసాగుతున్న నీటి విడుదల

నీటి మట్టం 884 అడుగులు

నీటి నిల్వ సామర్థ్యం 214 టీఎంసీలు

శ్రీశైలం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఒక గేటును 10 అడుగు ఎత్తు మేరకు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రెండు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 66,134 క్యూసెక్కులు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి నీటిమట్టం 884 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 214టీఎంసీలుగా నమోదైంది. ఎగువ జూరాల స్పిల్‌వే, విద్యుత్‌ ఉత్పత్తి, సుంకేసుల, హంద్రీ నుంచి మొత్తం 74,927 కూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చిచేరాయి. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 30.737 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసి జెన్‌- కో అధికారులు గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 10:39 PM