హాస్టల్ విద్యార్థులకు ఇక్కట్లు
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:25 AM
మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో తాగునీటి కష్టాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. హాస్టల్‌లో దాదాపు 1 నుంచి 10వ తరగతి వరకు 200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
మద్దికెర బీసీ హాస్టల్‌లో పనిచేయని బోరు.. పత్తాలేని వార్డెన్
మద్దికెర, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో తాగునీటి కష్టాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. హాస్టల్‌లో దాదాపు 1 నుంచి 10వ తరగతి వరకు 200 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కాగా, హాస్టల్‌కు మొత్తం విద్యార్థులు ఇంకా రాలేదు. ప్రస్తుతం 65 మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు.
నీటికోసం అవస్థలు..
హాస్టల్‌లో బోరు పనిచేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత్యంతరంలేక బస్టాండ్ సమీపంలోని శివాలయానికి వెళ్లి బకెట్లతో నీరు తెచ్చుకుం టున్నారు. అయితే హాస్టల్‌లో భోజనం కూడా అంతంత మాత్రమే ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అవి నిరుపయోగం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేయించి, వసతి గృహంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వార్డెన్ రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా తాను ఇప్పుడే బదిలీపై వచ్చానని ఇంకా విధుల్లో చేరలేదన్నారు.