Share News

న ల్లగా మారిన కులుమాల కుంట నీరు

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:26 AM

మండలంలోని కులుమాల గ్రామంలోని నీటి కుంటలోని నీరు మూడు రోజులుగా నల్లగా రంగు మారడంతో ఆ నీటి పట్ల గ్రామస్థులు, పశువుల యజమానులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

న ల్లగా మారిన  కులుమాల కుంట నీరు
నల్లగా మారిన కులుమాల కుంట నీరు

గోనెగండ్ల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కులుమాల గ్రామంలోని నీటి కుంటలోని నీరు మూడు రోజులుగా నల్లగా రంగు మారడంతో ఆ నీటి పట్ల గ్రామస్థులు, పశువుల యజమానులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివార్ల ఉన్న నీటి కుంటకు ఎల్లెల్సీ నుంచి నీటిని సరఫరా చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు నల్లగా మారడంతో పాటు దుర్గంధం వస్తుంది. పశువులు ఈ నీటిని తాగితే మృతి చెందే అవకాశాలు ఉన్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైన గిట్టని వారు నీటిలో విషంకు సం బంధించిన మందులు కలిపారా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంట పక్కనే గ్రామానికి తాగునీరు అందించే బోర్లు ఉన్నాయి. గ్రామస్థులు గ్రామ కార్యదర్శి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు నీటిని ల్యాబ్‌కు తీసుకువెళ్లి పరీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. కుంటలో ఉన్న నీటిని మంచినీటిగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:26 AM