శ్రీశైలం నుంచి సాగర్‌కు నీరు
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:49 PM
శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 205 టీఎంసీలుగా ఉంది. డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 883 అడుగులుగా నమోదు అయింది.
10 గేట్ల ద్వారా 5,76,940 క్యూసెక్కులు విడుదల
శ్రీశైలం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 205 టీఎంసీలుగా ఉంది. డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 883 అడుగులుగా నమోదు అయింది. శ్రీశైలం రిజర్వయర్ 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఒక్కొక్కటి 26 అడుగుల ఎత్తుకు తేరచి స్పిల్ వే గుండా 5,76,940 క్యూసెక్కులు దిగువ సాగర్‌కు విడుదల చేశారు. సోమవారం క్రస్ట్‌గేట్ల ఎత్తు 23 అడుగులుగా ఉండగా వరద ప్రవాహం పెరగడంతో జలశయం ఇంజనీర్లు మరో మూడు అడుగుల ఎత్తును పెంచారు. ఎగువ జూరాల గేట్లు 4,62,448 క్యూసెక్కులు, సుంకేసుల 30,736 క్యూసెక్కులు, హంద్రి 10,300 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో జలాశయం ఇంజనీర్లు ఎప్పటికప్పుడు వదర ఉధృతిని సాగనంపుతున్నారు. శ్రీశైలం కుడి , ఎడమ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి అనంతరం 64,211 క్యూసెక్కులు విడుదల చేశారు.