దద్దనాల ప్రాజెక్టుకు నీరు
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:09 PM
దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం ద్వారా గత 15 రోజులుగా నిరంతరం నీటి పంపింగ్ జరుగుతోంది.
15 రోజులుగా ఎత్తిపోతల పథకం ద్వారా నిరంతరం పంపింగ్
మోటార్ల మరమ్మతులకు రూ.25.75 లక్షలు సొంత నిధులు వెచ్చించిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం ద్వారా గత 15 రోజులుగా నిరంతరం నీటి పంపింగ్ జరుగుతోంది. ఎస్సార్బీసీ కాలువ నుంచి నాలుగు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో 5ఏళ్లు దద్దనాల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపింగ్ చేయకపోవడంతో నాలుగు మోటార్లు తుప్పుపట్టాయి. తిరిగి రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వీటికి ప్రాణం పోశారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి రావడంతో రైతుల స్థితిగతులను గమనించిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సొంత నిధులు రూ.25.75 లక్షలు వెచ్చించి తుప్పుపట్టిన మోటార్లకు మరమ్మతులు చేయించి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేయించారు. దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడంతో దద్దనాల ప్రాజెక్టుకు నీరు చేరుతున్నాయి. దద్దనాల ప్రాజెక్టు తూములను ఎత్తడంతో పంట కాలువల ద్వారా ప్రాజెక్టు పరిధిలోని రైతులు పంటలు పండించుకుంటున్నారు. రైతులు ఆ నీటితో పంటలకు మొక్కజొన్న తదితర పం టలు వేసిన రైతుతు నీటి తడులు కట్టుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు కలగకుండా మంత్రి ముందు చూపుతో ఎత్తిపోతల పథకానికి బనగానపల్లె సమీపంలోని ఎస్సార్బీసీ ఎత్తిపోతల పథకాన్ని గత 7 సంవత్సరాల క్రితం రూ.21 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి బనగానపల్లె పట్టణంలోని ఎస్సార్బీసీ కాలువ నుంచి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించారు. సుమారు 17 కిలోమీటర్ల వరకు పైపులైన్ వేయించారు. కోయా కంపెనీకి కాంట్రాక్టు అప్పగించి పనులు పూర్తి చేసి దద్దనాల ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయించి దద్దనాల ప్రాజెక్టుకు బీసీ జనార్దన్‌రెడ్డి నీరందించారు. దద్దనాల ఎత్తిపోతల ద్వారా నీరు అందుతుండడంతో ఈప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దద్దనాల ప్రాజెక్టుకు ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేయడంతో భూగర్భజలాలు కూడా పెరిగిపోయాయి. బోర్లలో నీరు పెరిగాయి. అలాగే ఈప్రాంతంలోని 20 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టు ఆదుకుంటోంది.