340 పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:12 AM
జిల్లా వ్యాప్తంగా 340 పంచాయతీల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి తెలిపారు.
చాగలమర్రి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 340 పంచాయతీల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి తెలిపారు. బుధవారం చాగలమర్రి గ్రామంలోని మేజర్ పంచాయతీ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చే శారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ చాగలమర్రి గ్రామ పంచాయతీల్లో 14 మంది వాటర్‌మెన్‌లు ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అంతమంది ఎందుకు అధికంగా ఉన్నారని, వారిని ఎలా చేర్చుకున్నారో వివరణ ఇవ్వాలని ఈవో తారకేశ్వరికి ఆదేశించారు. 489 గ్రామ పంచాయతీల్లో రూ.10కోట్లు పన్ను వసూలు లక్ష్యం ఉందన్నారు. ఇంతవరకు రూ.5 లక్షలు పన్ను వసూలు చేశారని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో ముందుగా గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు చెల్లించడం జరుగుతోందన్నారు. అక్టోబరు 2 వరకు స్వచ్ఛసేవ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.