తాగునీటి వృథా.. అధికారులకు కనిపించదా?
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:37 PM
నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని టీవీ టవర్ వద్ద 20వ వార్డు బద్రీనాథ్‌నగర్‌లో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ అవుతోంది. ప్రధాన రహదారి పక్కనే నీరు ఉంటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు
కల్లూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని టీవీ టవర్ వద్ద 20వ వార్డు బద్రీనాథ్‌నగర్‌లో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ అవుతోంది. ప్రధాన రహదారి పక్కనే నీరు ఉంటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం పైప్‌లైన్ పగిలినా వాటర్ వర్క్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే లీకేజీతో నీరు కలుషితవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి, లీకేజీని అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.