పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు తప్పవు : సీపీఐ
ABN , Publish Date - May 10 , 2025 | 11:50 PM
కవ్వింపు చర్యలు మానకుంటే పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు తప్పవని సీపీఐ కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరించారు. వీర మరణం పొందిన వీరజవాన్ మురళీనాయక్‌కు నాలుగు స్థంభాల కూడలిలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు
పత్తికొండ టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి): కవ్వింపు చర్యలు మానకుంటే పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు తప్పవని సీపీఐ కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరించారు. వీర మరణం పొందిన వీరజవాన్ మురళీనాయక్‌కు నాలుగు స్థంభాల కూడలిలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. పర్యాటకును హతమార్చడం దుర్మార్గమన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మన సైన్యం పాకిస్థా న్‌లోని సామాన్య ప్రజలను చంపకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజాసాహెబ్, రామాంజనేయులు, సురేంద్ర కుమార్, కృష్ణ, సుల్తాన్, సిద్దలింగప్ప, నెట్టికంటయ్య, గుండు బాషా తదితరులు పాల్గొన్నారు.