దర్శనం కోసం నిరీక్షణ
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:38 PM
శ్రీశైలం క్షేత్రంలో మల్లన్న దర్శనం కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
మల్లన్న క్షేత్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ
అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు
శ్రీశైలం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం క్షేత్రంలో మల్లన్న దర్శనం కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల కంటే సెలవు రోజుల్లో వచ్చే యాత్రికు లను ముందుగానే అంచనావేస్తూ దేవస్థానం అఽఽధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. వరుస సెలవులు కావడంతో ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి ఊహించని విధంగా భక్తులు ఒక్కసారిగా రావడంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఉభయ దేవాలయాల్లో దర్శనాలు పూర్తిచేసుకునేందుకు అధిక సమయం పడుతున్నందున భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దేవస్థానం వారు జారీ చేసిన వీఐపీ బ్రేక్ భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తుస్తున్నప్పటికీ రోజు కు మూడు విడతలు ఉండటం సామాన్యుల సర్వ దర్శనాలకు అడ్డంకిగా మారు తుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
నిర్ణీత సమయాన్ని కేటాయించి..
ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించి రోజు మొత్తంలో వచ్చే సిఫార్సు వీఐపీలకు కావలసిన దర్శనాలు చేయించమని దేవస్థానం అధికారులను వేడుకుంటున్నారు. శీఘ్ర అతిశీఘ్ర దర్శన క్యూలైన్లలో వేచిఉండే చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉం డేందుకు సౌకర్యాలను మరింతగా మెరుగుపర్చాలని భక్తులు కోరుకుంటున్నారు. జనవరి నెల నుంచి సెలవు రోజుల్లో ఇబ్బందులు లేకుండా స్వామిఅమ్మవార్ల దర్శన విధానాల్లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రాకపోకలు, వసతి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనాలు, అలంకార దర్శన సదుపాయాలను సర్దుబాటు చేయనున్నట్లు ఈవో అన్నారు.