Share News

బిల్లుల కోసంఎదురుచూపులు

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:26 PM

ఎంతో నమ్మకంతో గోకులం షెడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మండలంలో 8 గ్రామ పంచాయ తీలకు 32 మినీ గోకులాల షెడ్లు మంజూరయ్యాయి.

బిల్లుల కోసంఎదురుచూపులు
మద్దికెర మండలంలో పూర్తయిన గోకులం షెడ్డు

పూర్తయిన గోకులం షెడ్లు

నిధులు విడుదల చేయని ప్రభుత్వం

మద్దికెర, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎంతో నమ్మకంతో గోకులం షెడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మండలంలో 8 గ్రామ పంచాయ తీలకు 32 మినీ గోకులాల షెడ్లు మంజూరయ్యాయి. షెడ్ల నిర్మాణం కూడా పూర్తయింది, ఎమ్మెల్యే శ్యాంబాబు చేతుల మీదుగా ప్రారంభించి నెల అవుతోంది. అయినా బిల్లులు మంజూరు కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ఒక్కో గోకులం షెడ్ల నిర్మాణానికి మొత్తం రూ.2.23లక్షలు. ప్రభుత్వం రూ.2లక్షలు ఇస్తుండగా, రైతు రూ.23వేలు వాటా కట్టాల్సి ఉంది. తీరా నిర్మాణం పూర్తయాక ఇలా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

నివేదికలు పంపాం

మండలంలో పూర్తయిన గోకులం షెడ్ల వివరాలను జిల్లా అధికారులకు పంపాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. - ఏపీవో నర్సిరెడ్డి, మద్దికెర

హాలహర్వి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గానికి 250 మినీ గోకులం షెడ్లు మంజూరు కాగా, హాలహర్వి మండలానికి 41 కేటాయించారు. దీంతో రైతులు షెడ్లు నిర్మించుకు న్నారు కాని బిల్లులు మంజూరు కాలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

త్వరలోనే బిల్లులు

గోకులం షెడ్లు నిర్మించు కున్న వారికి త్వరలో బిల్లులు వస్తాయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉన్నతాధికా రులకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో ఖాతాలో నిధులు జమవుతాయి. - చక్రవర్తి, ఏపీవో, హాలహర్వి

Updated Date - Apr 26 , 2025 | 11:26 PM