Share News

పంటలను నమిలేస్తున్న తెగుళ్లు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:07 AM

ఈ రబీ సీజన్‌లో ఎమ్మిగనూరు డివిజన్‌ ప్రాంతంలో ఎక్కువ రైతులు మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటలను సాగు చేశారు. దాదాపు 10వేల ఎకరాలో సాగు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు పొలంబడి పేరుతో గ్రామాల పంట పొలాలలో పర్యటించామని, పంటలకు తెగుళ్లు ఎక్కువగా సోకాయని వ్యవసాయశాఖ ఏడీఏ మహుమ్మద్‌ఖాద్రీ, ఏవోహేమలత తెలుపుతున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు చేశారు. రైతులు తెగుళ్లుకు నివారణ చర్యలు తీసుకోక పోతే పంట నష్టం జరుగు తుందని అధికారులు తెలుపుతున్నారు.

పంటలను నమిలేస్తున్న తెగుళ్లు
వరి పంటకు సోకిన మానిపండు తెగులు.. మొక్కజొన్నకు సోకిన కత్తెర పురుగు

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

(ఏడీఏ మహుమ్మద్‌ ఖాద్రీ

గోనెగండ్ల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈ రబీ సీజన్‌లో ఎమ్మిగనూరు డివిజన్‌ ప్రాంతంలో ఎక్కువ రైతులు మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటలను సాగు చేశారు. దాదాపు 10వేల ఎకరాలో సాగు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు పొలంబడి పేరుతో గ్రామాల పంట పొలాలలో పర్యటించామని, పంటలకు తెగుళ్లు ఎక్కువగా సోకాయని వ్యవసాయశాఖ ఏడీఏ మహుమ్మద్‌ఖాద్రీ, ఏవోహేమలత తెలుపుతున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ప్రాంతంలో ఎక్కువగా వరి సాగు చేశారు. రైతులు తెగుళ్లుకు నివారణ చర్యలు తీసుకోక పోతే పంట నష్టం జరుగు తుందని అధికారులు తెలుపుతున్నారు.

మొక్క జొన్న: మొక్క జొన్న పంటకు కత్తెర పురుగు సోకింది. లార్వా పిల్ల పురుగులు గుడ్ల నుంచి పొదిగి మొక్క ఎదగకుండా చేస్తుంది. ఏమామెక్టిన్‌బెంజోయేట్‌ మందును ఒక లీటరు నీటికి 0.3 గ్రాములు కలుపుకొని మొక్క సుడుల్లో 3 నుంచి 4 చుక్కలు మందు ద్రావణం పడేటట్లు చూడాలి. ప్రోపికోనజోల్‌ 1మిల్లీ లీటర్‌ లేదా మాంజోజబ్‌, కార్బన్డజెమ్‌ 2 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వేరుశనగ: ప్రస్తుతం సాగు చేసిన వేరుశనగ పంటలో ఇనుము ధాతువులు లోపం ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ కారణంగా ఆకులు పసుపు పచ్చగా మారి తర్వాత తెల్లటి రంగులోకి మారుతుంది. నివారణకు అన్నభేధి 5గ్రాములు ఒక లీటరు నీటిలో కలుపుకొని 10 రోజుల వ్యవదిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

వరి: ఈ రబీలో సాగు చేసిన వరికి పంటకు మానిపండు తెగులు సోకింది. ప్రస్తుతం గింజ గట్టి పడే దశలో ఉంది. ఈ తెగులు ఆశించడం వల్ల గింజ పై పసుపురంగు ముద్దలు ఏర్పడి తర్వాత నలుపు రంగులోకి మారుతాయి. నివారణకు ప్రొపికోనజోల్‌ ఒక మిల్లీ లీటరును ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేస్తు తెగులు అదుపులోకి వస్తుంది.

Updated Date - Dec 17 , 2025 | 12:07 AM