Share News

ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల తనిఖీ

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:32 AM

స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలను మంగళవారం జిల్లా వృత్తి విద్యాధికారి సురేష్‌బాబు తనిఖీ చేశారు.

ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల తనిఖీ
అధ్యాపకులతో మాట్లాడుతున్న డీవీఈవో సురేష్‌బాబు

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూన 3(ఆంధ్రజ్యోతి): స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలను మంగళవారం జిల్లా వృత్తి విద్యాధికారి సురేష్‌బాబు తనిఖీ చేశారు. 2025-26 విద్యాసంవత్సరా నికి సంబంధించి కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, సమయ పాలన పాటిస్తూ వార్షిక ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులతో యోగాసనాలు, మెడిటేషన చేయిస్తూ సృజనాత్మకతను పెంచడానికి కృషి చేయాలన్నారు. కళాశా లలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాదీవెన పథకంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా సప్లయ్‌ చేస్తున్న పాఠ్యపుస్తకాలను డీవీ ఈవో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. నాగస్వామి నాయక్‌, అధ్యాపకులు ప్రసన్న కుమార్‌, రామకృష్ణ, విజయశేఖర్‌, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:33 AM