రూ.14.6 కోట్లతో విశ్రామ్ సదన్ భవనం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:45 AM
రోగుల సహాయకులకు వసతి కల్పించేందుకు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఎదుట పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.14.6 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించబడుతున్న విశ్రామ్ సదన్ మాస్టర్ ప్లాన్‌ను అధికారులు పరిశీలించారు.
మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన పవర్‌గ్రిడ్ అధికారులు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రోగుల సహాయకులకు వసతి కల్పించేందుకు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఎదుట పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.14.6 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించబడుతున్న విశ్రామ్ సదన్ మాస్టర్ ప్లాన్‌ను అధికారులు పరిశీలించారు. మంగళవారం కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, అబ్దుల్ రహీమ్, ఎన్‌బీసీసీ బిల్డింగ్ ఆర్కిటెక్ హర్షవర్దన్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబరులో విశ్రమ్ సదన్ మాస్టర్ ప్లాన్ డిజైన్‌లను పరిశీలించారు. ఈ సందర్బంగా కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ జీ+3 అంతస్థుల ఆధునిక వసతి భవనం మొత్తం 150 పడకల సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్‌కు వచ్చే సుదూరమైన రోగుల సహాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.