Share News

వైభవంగా వినాయక నిమజ్జనం

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:01 AM

మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుడి నిమజ్జనం శుక్రవారం వైభవంగా నిర్వ హించారు.

వైభవంగా వినాయక నిమజ్జనం
కోడుమూరు: వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తులు

కోడుమూరు రూరల్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుడి నిమజ్జనం శుక్రవారం వైభవంగా నిర్వ హించారు. మూడు రోజులపాటు పూజలందుకున్న విగ్రహాలను నిమజ్జ నానికి తరలించారు. ముందుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం వీధుల్లో మేళ తాళాలు, డప్పుశబ్దాల మధ్య వినాయ కుడిని ఊరేగించారు. విగ్రహాల ముందు చిన్నపిల్లలు, యువ కులు సంతోషాలతో డ్యాన్స చేశారు. వర్కూరు సద్గురు ఖాజాహుశే నదాసు దర్గాలో ముస్లింలు వినాయక చవితి వేడుకలు జరిపించారు. లద్దగిరి, గోరంట్ల, వెంకటగిరి, బైనదొడ్డి, పులకుర్తి, ముడుమలగుర్తి, క్రిష్ణాపురం వంటి గ్రామాల్లో నిమజ్జనం జరిగింది.

గణేశుడి లడ్డూ రూ.30 వేలు: మండలంలోని లద్దగిరి గ్రామంలో గణేశుడి లడ్డూ వేలంలో రూ.30వేలు పలికింది. స్థానిక వై సర్కిల్‌ వద్ద శాంతి వినాయక బృందం ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహంపై ఉంచిన వివిధ పూజా ద్రవ్యాలు వేలం చేపట్టారు. ఇక్కడి లడ్డూను సురేంద్ర అనే యువకుడు వేలంలో కైవసం చేసుకున్నాడు. అలాగే వర్కూరు కమ్మరి కొలిమి వద్ద రూ.25వేలకు బట్టి సుంకన్న అనే వ్యక్తి దక్కించుకున్నాడు. అలాగే చింతతోట దారిలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద లడ్డూ వేలంలో రూ. 18 వేలు పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.

కోడుమూరు: పట్టణంలో మూడు రోజుల పాటు పూజలు అందుకొన్న గణనాథుడిని భక్తులు శుక్రవారం నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనాలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఓర్వకల్లు: వినాయకుని చవితి పురస్కరించుకుని మూడు రోజులు పూజలందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేశారు. మండ లంలోని నన్నూరు, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, కొమరోలు తిప్పాయ పల్లె, శకునాల, లొద్దిపల్లె, గుట్టపాడు, ఎన.కొంతలపాడు తదితర గ్రామాల్లో గణనాథులను ట్రాక్టర్లపై ఏర్పాటు చేసి మేళతాళాలతో గ్రామాల్లో వీధుల్లో ఊరేగించారు. యువత కేరిం తలు వేస్తూ రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న చెరువులు, బావులు, కుంటల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.

గూడూరు: మండలంలోని ఆర్‌ కానాపురం, చనుగొండ్ల గ్రామాల్లో గణేశ నిమజ్జనం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆయా గ్రామాల్లోని వినాయక మండపాల్లో స్వామి వారికి పూజలు నిర్వహించి, లడ్డూ వేలం నిర్వహించారు. అనంతరం ఒక్కొక్కటిగా మండపాల నుండి వినాయక విగ్రహాలు ఊరేగింపుగా బయలు దేరాయి.

Updated Date - Aug 30 , 2025 | 01:01 AM