Share News

బీవీ హయాంలోనే గ్రామాభివృద్ధి : టీడీపీ

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:37 PM

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హయాంలోనే కె.తిమ్మాపురం గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గ్రామ ఉప సర్పంచ ఉరుకుందు, యూనిట్‌ కన్వీనర్‌ ఉరు కుందులు అన్నారు.

బీవీ హయాంలోనే గ్రామాభివృద్ధి : టీడీపీ
వర్షపు నీరు వెళ్లేందుకు కాలువ తీయిస్తున్న టీడీపీ నాయకులు

ఎమ్మిగనూరు రూరల్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హయాంలోనే కె.తిమ్మాపురం గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గ్రామ ఉప సర్పంచ ఉరుకుందు, యూనిట్‌ కన్వీనర్‌ ఉరు కుందులు అన్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి గ్రామంలోని వీధుల్లో నీరు చేరాయి.డ్రైనేజీలు నిండి వర్షపునీరు వెళ్లే దారి లేక ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాలతో వర్షపునీరు కాలువల్లోకి వెళ్లేలా ఎక్స్‌కవేటర్‌తో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఈ కార్యక్రమంలో బీటీ శ్రీరాములు, రాముడు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 11:37 PM