గజ్జకట్టిన పల్లెపాట
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:28 PM
నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహిచిన ‘గజ్జకట్టిన పల్లెపాట’ సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఊర్రూతలూగించిన జానపద కళాకారులు
అలరించిన ఉస్మాన్ మిమిక్రీ
కర్నూలు కల్చరల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహిచిన ‘గజ్జకట్టిన పల్లెపాట’ సంగీత విభావరి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనంతపురం నుంచి వచ్చిన పరిమళ రాజు బృందం కళాకారులు జానపద పాటలకు నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు. అనంతరం ఉస్మాన్ బాషా చేసిన మిమిక్రీ ఆకట్టుకుంది. ఎమ్మిగనూరు కళాకారుడు ఖాజావలి బృందం జానపద గీతాలను ఆలపించింది. అనంతరయం జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను జేవీవీ ప్రతినిధులు శేషాద్రి రెడ్డి, బి.శ్రీరాములు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజల్ గాయకుడు మహ్మద్ మియా, కార్యదర్శి యాగంటీశ్వర్, సి.వి.రెడ్డి, కె.వి.రమణ, తబలిస్ట్ మహేష్, అనంతపురం, కర్నూలు కళాకారులు పాల్గొన్నారు.