Share News

ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డీడీగా విఘ్నేశ్‌ అప్పావ్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:01 AM

ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా విఘ్నేశ్‌ అప్పావ్‌ను నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డీడీగా విఘ్నేశ్‌ అప్పావ్‌
విఘ్నేశ్‌ అప్పావ్‌

ఆత్మకూరు/నంద్యాల ఎడ్యుకేషన్‌ సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా విఘ్నేశ్‌ అప్పావ్‌ను నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వి.సాయిబాబాను తిరుపతి జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేశారు. దీంతో ఆయన స్థానంలో అనంతపురం జిల్లా అటవీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న విఘ్నేశ్‌ అప్పావ్‌ నియమితులయ్యారు. ఆయన గతంలో మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన సందర్భంలో కొద్దిరోజుల పాటు ఆత్మకూరు ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. నంద్యాల కేంద్రంగా నాగార్జునసాగర్‌-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తిని బదిలీ చేసి ఆయన స్థానంలో రాజమహేంద్రవరం స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌ను ఎన్‌ఎస్‌టీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన కూడా గతంలో ఆత్మకూరు డీఎఫ్‌వోగా పనిచేశారు.

Updated Date - Sep 12 , 2025 | 12:01 AM