నంద్యాలలో విజిలెన్స్ దాడులు
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:09 AM
: జిల్లా కేంద్రంలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిం చారు. పలు రేషన్ దుకాణాలతో పాటు హోటళ్లను కర్నూలు జిల్లా విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐలు, ఎస్‌ఐల బృందం తనిఖీ చేసినట్లు తెలిపారు.

రేషన్ షాప్‌లు, హోటళ్లలో తనిఖీ
5 గృహ వినియోగ సిలిండర్లుసీజ్
హోటళ్ల నిర్వాహకులపై కేసులు
నంద్యాల క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిం చారు. పలు రేషన్ దుకాణాలతో పాటు హోటళ్లను కర్నూలు జిల్లా విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐలు, ఎస్‌ఐల బృందం తనిఖీ చేసినట్లు తెలిపారు. పట్టణంలోని మూడు రేషన్ దుకాణాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. జె.నాగన్న అనే డీలర్ నిర్వహిస్తున్న రేషన్‌షా ప్‌లో 46చక్కెర ప్యాకెట్లు అధికంగా ఉన్నట్లు ఈపోస్ స్టాక్‌ను పరిశీలిం చగా బయటపడినట్లు తెలిపారు. ఈ మేరకు డీలర్ నాగన్నపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీలక్ష్మిశ్రీనివాస హోటల్, గ్రాండ్ ఫాస్ట్‌ఫుడ్, జావెద్‌హోటల్, గోల్డెన్ ఫుడ్ ఫ్లాజాలపై కూడా దాడిచేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో హోటళ్ల నిర్వాహకులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కాకుండా గృహ సంబంధిత గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. దీంతో 5గృహ సంబంధిత గ్యాస్ సిలిండర్లను పంచనామా నిర్వహించి సీజ్ చేసినట్లు వెల్లడించారు. సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారుల వెంట సివిల్ సప్లై అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.