ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విచారణ
ABN , Publish Date - May 21 , 2025 | 12:05 AM
వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర వ్యయంపై హొళగుంద ఎంపీడీవో కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు వెంకటరమణ, మల్లేశ్వరమ్మ, విచారణ చేపట్టినట్లు ఎంపీడీవో విజయలలిత మంగళవారం తెలిపారు.
హొళగుంద, మే 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర వ్యయంపై హొళగుంద ఎంపీడీవో కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు వెంకటరమణ, మల్లేశ్వరమ్మ, విచారణ చేపట్టినట్లు ఎంపీడీవో విజయలలిత మంగళవారం తెలిపారు. కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులతో విజిలెన్స్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో మండల, గ్రామ స్థాయిలో చేసిన చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన క్రీడా పరికరాలు, అనంతరం వాటిని ఎవరికీ ఇచ్చారన్న విషయాలపై ఆరా తీశారు. క్రీడాకారులకు భోజన సదుపాయాలు వివరాలను సేకరించారు. కార్యదర్శులు రాజశేఖర్ గౌడ్, నాగరాజు, రంగస్వామి, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు.