సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:44 PM
కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు రెండు బంగారు పతకాలు, ఒక రజిత పతకాన్ని, 10 కాంస్య పతకాలు సాదించారు.
రాష్ట్రస్థాయి తైక్వాండోలో 10 , ఈత పోటీల్లో 11 పతకాలు
నలుగురు క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపిక
కర్నూలు స్పోర్ట్స్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు రెండు బంగారు పతకాలు, ఒక రజిత పతకాన్ని, 10 కాంస్య పతకాలు సాదించారు. ఆదివారం షరీన్‌నగర్‌లో ఉన్న వెంకటేశ్ తైక్వాండో సెంటర్‌లో భారత సెపక్‌తక్రా సంఘం ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాసులు క్రీడాకారులను అభినందించారు. జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని అక్కడ కూడా రాణించాలని ఆకాంక్షించారు. కోచ్ వెంకటేశ్, నాగన్న విద్యార్థులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పదో సబ్ జూనియర్, జూని యర్ వింటర్ ఇంటర్ డిస్ర్టిక్ట్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్-2025 ఈత పోటీల్లో జిల్లా స్విమ్మర్లు ప్రతిభ కనబరిచారు. ఒక బంగారు పతకం, 5 వెండి, కాంస్య పతకాలు- 5 మొత్తం 11 మెడల్స్ సాదించారు. గ్రూప్-1 విభాగంలో ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాదించారు. స్విమ్మర్లను డీఎస్‌డీవో భూపతిరావు, కోచ్ నటరాజ్, డిస్ర్టిక్ట్ అక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహ ఆచారి, సెక్రటరీ రామకృష్ణ యాదవ్, ట్రెజరర్ దస్తగిరి, జాయింట్ సెక్రటరీలు రామకృష్ణ శివరాజ్ అభినందించారు.