డాక్టర్స్ ప్రీమియం లీగ్ విజేత డెంటల్ స్ర్టెకర్స్
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:58 AM
42 రోజులుగా కర్నూలులో నిర్వహించిన డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ జట్టు విజేతగా నిలిచింది. రాయల్ స్పోర్ట్స్ గ్రౌండులో జరిగిన పోటీల్లో కేఎంసీ అల్యూమి మరియు కర్నూలు డెంటల్ స్ట్రెకర్స్ జట్లు తలపడ్డాయి
కర్నూలు హాస్పిటల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): 42 రోజులుగా కర్నూలులో నిర్వహించిన డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ జట్టు విజేతగా నిలిచింది. రాయల్ స్పోర్ట్స్ గ్రౌండులో జరిగిన పోటీల్లో కేఎంసీ అల్యూమి మరియు కర్నూలు డెంటల్ స్ట్రెకర్స్ జట్లు తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ చేసిన కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ఇందులో డా.రాఘవేంద్ర రెడ్డి 40 పరుగులు అత్యధికంగా చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు మెడికల్ కాలేజీ అల్నూమి జట్లు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయడంతో 26 పరుగుల తేడాతో డెంటల్ స్ర్టెకర్స్ జట్లు విజయం సాదించింది. విజేత జట్టుకు కేప్టన్ డా.రాఘవేంద్ర రెడ్డికి రన్నర్ అయిన కేఎంసీ అల్నూమి కేప్టెన్ డా.రవి కళాధర్ రెడ్డికి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అద్యక్షుడు మెన్స్ జిల్లా క్రికెట్ సంఘం అద్యక్షుడు డా.గోవిందరెడ్డి, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డా.లక్కిరెడ్డి అమరసింహారెడ్డి ట్రోఫీని అందజేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా డా.వై.రాఘవేంద్ర రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఉత్తమ బౌలర్‌గా డా.రమేష్ గౌడు, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా డా.సుభాష్; ఉత్తమ ఫీల్డర్‌గా డా.గౌస్ ఎంపికయ్యారు.