Share News

శభాష్‌ నిర్మల..

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:51 PM

శభాష్‌ నిర్మల, బాగా చదువుకో నీ చదువు బాధ్యత తహసీల్దార్‌దేనని, ఎప్పటికప్పుడు తహసీల్దార్‌కు తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ అన్నారు. మండలంలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నిర్మల ఇంటర్‌లో 966 మార్కులు తెచ్చుకోవడంతో మంగళవారం సన్మానించారు.

శభాష్‌ నిర్మల..
నిర్మలను సన్మానిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌

సన్మానించిన జేసీ, సబ్‌ కలెక్టర్‌

ఆంధ్రజ్యోతి కథనాలతో కదిలిన అధికారులు

ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): శభాష్‌ నిర్మల, బాగా చదువుకో నీ చదువు బాధ్యత తహసీల్దార్‌దేనని, ఎప్పటికప్పుడు తహసీల్దార్‌కు తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌ అన్నారు. మండలంలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నిర్మల ఇంటర్‌లో 966 మార్కులు తెచ్చుకోవడంతో మంగళవారం సన్మానించారు. 2023 జూన్‌లో బాలిక చదువు ఆగిపోవడాన్ని గమనించిన ఆంధ్రజ్యోతి ప్లీజ్‌ మా అమ్మకు మీరైనా చెప్పండి’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. నాటి జిల్లా కలెక్టర్‌ సృజన విద్యార్థినిని తన ఛాంబర్‌కు పిలిపించుకొని ఆస్పరి కస్తూర్బా పాఠశాలలో ఇంటర్‌ బైపీసీలో చేర్పించిన విషయం విదితమే. కురువ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవేంద్రప్ప,తహసీల్దార్‌ శివరాముడు, డీటీ పెద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Apr 15 , 2025 | 11:51 PM