Share News

బొలెరో వాహనం బోల్తా..

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:03 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలం దారిలోని ఓం నమోనారాయణ మలుపు వద్ద శనివారం బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. కడప జిల్లా కొండురు గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు దైవ దర్శనం కోసం అహోబిలం క్షేత్రానికి వచ్చారు.

బొలెరో వాహనం బోల్తా..
గాయపడిన భక్తులు

పదిమందికి గాయాలు

ఆళ్లగడ్డ, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలం దారిలోని ఓం నమోనారాయణ మలుపు వద్ద శనివారం బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. కడప జిల్లా కొండురు గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు దైవ దర్శనం కోసం అహోబిలం క్షేత్రానికి వచ్చారు. దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకొని ఎగువ అహోబిలం వెళ్తుండగా ఓం నమో నారాయణ మలుపు వద్ద వాహనం బోల్తా పడింది. దాంతో కొండూరు గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, షేక్‌ బాలంబి, షేక్‌ కమాల్‌బి, భరణి, వెంకటసుబ్బయ్యతో పాటు మరో ఐదు మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని సహాక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతాప్‌రెడ్డి, భరణిలను మెరుగైన చికిత్స కోసం కడప ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్‌.కొట్టాల గ్రామ సమీపంలో ...

బేతంచెర్ల: జీపు ముందు టైర్లు రాడ్‌ విరగడంతో పొలంలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బేతంచెర్ల, డోన్‌ రహదారిలోని హెచ్‌.కొట్టాల గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కర్నూలు చెందిన ఐదుగురు జీపులో ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులోని మద్దిలేటి స్వామిని దర్శించుకున్నారు. తిరిగి స్వప్రాంతానికి వెళ్తుండగా జీపు ముందు టైర్ల రాడ్డు విరిగింది. దాంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:03 AM