వీరేష్ బంధువుల ఆచూకీ లభ్యం
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:59 AM
31 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి తిరిగి వచ్చిన వీరేష్ బంధువుల వివరాలు తెలిశాయి. మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘31 యేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు’ కథనాన్ని చదివిన వీరేష్ బంధువులు గుర్తుపట్టి ఆదోనికి చేరుకున్నారు.
ఆదోనికి వచ్చిన మామ
ఇప్పటికే తల్లిదండ్రులు, నానమ్మ మృతి
విచారించి వారికి అప్పజెప్పిన అధికారులు
ఆదోని, జూలై 1(ఆంధ్రజ్యోతి): 31 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి తిరిగి వచ్చిన వీరేష్ బంధువుల వివరాలు తెలిశాయి. మంగళవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘31 యేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు’ కథనాన్ని చదివిన వీరేష్ బంధువులు గుర్తుపట్టి ఆదోనికి చేరుకున్నారు. కర్నూలు సమీపంలోని సూదిరెడ్డి పల్లెలో ఉన్న మేనత్త లక్మి, జగదీష్ వీరేష్‌ను గుర్తించి తహసీల్దార్ రమేష్ వద్దకు వచ్చారు. తమ వద్ద ఉన్న ఫొటోలు, రేషన్ కార్డులో ఉన్న నాన్నమ్మ అంజనమ్మ ఫోటోను చూపడంతో వీరేష్ గుర్తుపట్టాడు. కాగా వీరేష్ తండ్రి జనార్ధన్, తల్లి పద్మ, నాన్నమ్మ అంజనమ్మ అందరూ మృతిచెందినట్లు తెలియడంతో విలపించాడు. వీరేష్ తల్లిదండ్రులు కుమారుడు తప్పియాన్న బాధతోనే చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఎట్టకేలకు 31 యేళ్ల తర్వాత బంధువులు కలుసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వీరేష్‌ను బంధువులకు అప్పజెప్పారు.