Share News

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:28 AM

నగరంలోని వివిధ ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
వాసవీనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులు

అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): నగరంలోని వివిధ ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బళ్లారి చౌరస్తా, ఉల్చాలరోడ్డులోని వాసవీనగర్‌లోని వేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకుడు రామానుజ మూర్తి, అర్చకుడు విష్ణు ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తర శతనామ కుంకుమార్చన చేసి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో యాలిశెట్టి భద్రయ్య శెట్టి కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోగల విశ్వహిందూ పరిషత (వీహెచపీ) కార్యాలయంలో భరత మాత ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, గుణ్ణంపల్లి నారాయణమ్మ ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వీహెచపీ నాయకులు గూడా సుబ్రహ్మ ణ్యం, ఈపూరి నాగరాజు, శివకోటి చంద్రశేఖర్‌, ఉపేంద్ర నాయక్‌ సహ కారం అందించారు. నగరంలోని హరిశ్చంద్రనగర్‌లోని సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో వీహెచపీ- మాతృశక్తి జిల్లా కన్వీనర్‌ మాళిగి పావని నిర్వహణలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. ముత్తయిదువులు మహాలక్ష్మి విగ్రహానికి ధూప, దీప నైవేద్యాలతో పూజలు చేసి, వరలక్ష్మి వ్రత కథను ఆలకించి, మహా మంగళ హారతితో కార్యక్ర మాన్ని నిర్వహించారు. 108 సార్లు మహాలక్ష్మి అష్టోత్తర శతనామ కుంకు మార్చన, 108 తామరపుష్పాలతో అర్చనలు వైభవంగా చేశారు. అనం తరం 16 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో మాతృశక్తి, దుర్గావాహిని సంస్థల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. పాతనగరంలోని పేట శ్రీరామాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు మాళిగి హనుమేషాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను భక్తులు ఆచరించారు. కార్యక్రమంలో మాధ్వ మహిళా ప్రతినిధులు జాహ్నవి, జ్యోతి, వసుధ పాల్గొన్నారు. మామిదాలపాడులోని గోదాగోకుల క్షేత్రంలో గోదా అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించా రు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్‌ భట్టాచార్య తీర్థప్ర సాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో గోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజు గుప్త, మేనేజింగ్‌ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు పాల్గొన్నారు. పాతనగరంలోని లలితా పీఠంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, కుం కుమార్చనలు నిర్వహించారు. 108 కలశాలు, 108 మంది ముత్తయిదు వులతో పూజలు చేశారు. వేద పండితుడు మామిళ్లపల్లి రాజేశశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి ముత్తయిదువులకు చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు.

గూడూరు: మండలంలోని కె.నాగులాపురం సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ, తదితర పూజలు చేశారు. అమ్మవారి ఆలయం ఆవరణలో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, సిబ్బంది కేశవ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:29 AM