జేడీగా వరలక్ష్మికి పదోన్నతి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:06 PM
కర్నూలు వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతూ ఇన్‌చార్జి జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వరలక్ష్మికి రెగ్యులర్ జేడీగా శుక్రవారం పదోన్నతి కల్పించారు.
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కర్నూలు వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతూ ఇన్‌చార్జి జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వరలక్ష్మికి రెగ్యులర్ జేడీగా శుక్రవారం పదోన్నతి కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ డైరెక్టర్లుగా ఏళ్ల తరబడి కొనసాగుతూ ఇన్‌చార్జి జేడీలుగా బాధ్యతలు మోస్తున్న వ్యవసాయ శాఖ లోని అధికారులకు ప్రభుత్వం ఎట్టకేలకు కరుణ చూపింది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు జేడీ వరలక్ష్మికి అభినందనలు తెలిపారు.