Share News

వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌..!

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:37 PM

ఆత్మకూరు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లమల అడవుల్లోని మునిమడుగుల వాగుపై నిర్మించిన వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌ నిండుకుండలా కనిపిస్తోంది.

వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌..!
నిండుకుండలా కనిపిస్తున్న వరద రాజ స్వామి ప్రాజెక్ట్‌

నిండుకుండలా జలాశయం

ఆత్మకూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లమల అడవుల్లోని మునిమడుగుల వాగుపై నిర్మించిన వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌ నిండుకుండలా కనిపిస్తోంది. నల్లమలలో కురుసిన భారీ వర్షాలతో ప్రాజెక్ట్‌లో గరిష్ట స్థాయిలో నీటిమట్టం నమోదైంది. దీంతో కొన్నిరోజులుగా ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 370మీటర్లు గానూ 369.5మీటర్ల నీటినిల్వలకు చేరుకున్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్‌ గరిష్ట నీటిసామర్థ్యం 389.1 ఎంసీఎ్‌ఫటీలకు గానూ 374.6 ఎంసీఎఫ్‌టీలకు చేరుకుంది. దీంతో ప్రాజెక్ట్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన వర్షపు నీటిని దిగువ మునిమడుగుల వాగుకు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Updated Date - Aug 19 , 2025 | 11:37 PM