Share News

ఉరుకుంద ఆలయ డీసీగా వాణి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:05 AM

ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయపు డిప్యూటీ కమిషనర్‌గా ఆదివారం కె.వాణి బాధ్యతలు చేపట్టారు.

ఉరుకుంద ఆలయ డీసీగా వాణి

కౌతాళం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయపు డిప్యూటీ కమిషనర్‌గా ఆదివారం కె.వాణి బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ కార్యాలయంలో డీసీ విజయరాజు నుంచి పదవి బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇదే దేవాలయానికి వాణి అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో విధులు నిర్వర్తించారు. ఇక్కడ పని చేస్తున్న డీసీ విజయరాజు అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయానికి బదిలీ అయ్యారు. అక్కడ పని చేస్తున్న వాణిని ఉరుకుందకు బదిలీ కావడంతో ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి మరింత పాటుపడుతానని తెలిపారు.

Updated Date - Aug 11 , 2025 | 12:05 AM