స్వాతంత్రోద్యమ స్ఫూర్తి వందేమాతరం
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:30 AM
స్వాతంత్రోద్యమ స్ఫూర్తి వందేమాతరం గీతమని ఎస్‌ఐ మదుసూదన అన్నారు.
150 ఏళ్లు పూర్తి
ప్యాపిలి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్వాతంత్రోద్యమ స్ఫూర్తి వందేమాతరం గీతమని ఎస్‌ఐ మదుసూదన అన్నారు. బంకింగ్ చంద్ర ఛటర్జీ వందే మాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, శిశుమందిరం, ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థులు వందేమాతరం గీతాలాపాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ మదుసూదన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కారుల్లో వందేమాతరం గీతం ఉత్సాహాన్ని నింపింద న్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం, నవీనపాటి, ఓబులేసు, బీసీ విజయ్‌కుమార్, వాసు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహోజ్వల మంత్రం వందేమాతరమని ఎంపీడీవో నూర్జహాన, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత అన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం వేడుకలు నిర్వహిం చారు. ఆళ్లగడ్డ నియోజక వర్గం అపుస్మా అధ్యక్షుడు అమీర్‌బాషా ఆధ్వర్యంలో విద్యార్థులు, అధికారులు పాత బస్టాండ్ కూడలిలో సామూహిక వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఎంఈఓ శోభావివేకవతి, టౌన ఎస్‌ఐ జయ్యప్ప, మున్సిపాలిటీ మేనేజర్ ఆనంద్, ఎంఈఓ-2 గంగాధర్, రిటైర్ జిల్లా న్యాయాధికారి శివప్రసాద్, డాక్టర్ రామ్‌గోపాల్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
బనగానపల్లె: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో కస్బా, తెలుగు ప్రాథమిక, ఉర్దూ, పాఠశాలల హెచఎంలు సుంకన్న, మహ బూబ్ బాషా, హెచఎం ప్రతాప్‌లు విద్యార్థులు వందేమాతరం గీతా లాపన నిర్వహించారు. పలు పాఠశాల్లో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి భగల విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమాల్లో ఎంఈవో స్వరూప, బీజేపీ నాయకులు శరతచంద్ర, యాదగిరి, టీచర్ సతీశ, జిల్లా యూటీఎఫ్ సహాధ్యక్షుడు సత్యప్రకాశ, అబ్దుల్ కలీం పాల్గొన్నారు.
సంజామల: మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శుకవారం వందేమాతర గీతాలాపనతో మార్మోగాయి. మండల పరిషత కార్యాల యం, కేజీబీవీ, ఉన్నత పాఠశాలల్లో ఎంపీడీవో రామసుబ్బయ్య ఆధ్వ ర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అధికారులు, విద్యార్థులు వందేమాతం గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిని శ్రీలేఖ, ప్రధానోపాధాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డోన టౌన: బంకింగ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హోదాన్ని కల్పించారు. శుక్రవారం డోన మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడు ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి డోన గాంధీ చౌక్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకటరమణ, పట్టణ అధ్యక్షులు బద్రి సుధాకర్ పాల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సోషల్ సేవా నిర్వహకుడు రఫీ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.