విద్యతోనే విలువ, గుర్తింపు
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:12 AM
చదువుతోనే సమాజంలో విలువ, గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ పిలుపునిచ్చారు.
సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ
ఎమ్మిగనూరు టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చదువుతోనే సమాజంలో విలువ, గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఉప్పర (సగర) కల్యాణ మండపంలో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ కష్టమే విజయానికి మార్గం అన్నారు. ఉద్యోగాలు పొందిన వారి ఇతరులకు కూడా సహాయం చేస్తూ స్ఫూర్తిగా నిలవాలన్నారు. నేటికీ అనేక రంగాల్లో వెనుకబడిన సగర కులస్థులు చైతన్యవంతులై అభివృద్ధి చెందాలన్నారు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన సగర కార్పొరేషన్ డైరెక్టర్ ములికి సూరిబాబు కు మార్తె సత్యవతి వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలి చినందుకు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరన్న, ప్రధాన కార్యదర్శి నక్కా కృష్ణమూర్తి, పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప, డ్వామా పీడీ సిద్దలింగప్ప, రవీంద్ర, రిటైర్ట్ డీఎస్పీ వెంకటయ్య, సగర కార్పొరేషన్ డైరెక్టర్లు నంద్యాల సురేష్, రామగిడ్డయ్య, సీఐ శ్రీధర్, రామన్న, సుధాకర్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.