సబ్సిడీ పథకాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:30 AM
రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలను వినియోగించుకోవాలని ఎంపీడీవో గీతావాణి సూచించారు.
ఆస్పరి, జూలై23(ఆంధ్రజ్యోతి): రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలను వినియోగించుకోవాలని ఎంపీడీవో గీతావాణి సూచించారు. బుధవారం కారుమంచి గ్రామంలో ఉపాధి పథకం కింద రైతు మల్లికార్జునగౌడ్ సాగుచేసిన డ్రాగన్‌ఫ్రూట్ తోటను పరిశీలించారు. తోటకు అవసరమయ్యే మొక్కలు, ఎరువులు, వ్యవసాయ ఖర్చులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. దిగుబడివ ప్రారంభం కావడంతో రైతు అవలంభించిన పద్ధతులను అడిగి తెలుసుకున్నారు ఉద్యాన పంటలను సాగు చేసి, దిగుబడి సాధించాలని సూచించారు. ఐదెకరాల్లోపు, ఉన్న రైతులకు మామిడి, దానిమ్మ, అరటి, జామ, ద్రాక్ష తదితర పంటలకు సబ్సిడీ కింద ఉపాధి పథకం నుంచి అందజేస్తామన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.