నేర పరిశోధనలో టెక్నాలజీని వాడండి
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:42 AM
నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీని వాడాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీని వాడాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పోక్సో కేసులో చార్జ్‌షీటు త్వరగా దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎ్‌స(ఫోరెన్సిక్ ల్యాబ్ అండ్ సైన్స్) రిపోర్టు వచ్చిన కేసుల్లో చార్జ్‌షీటు వేసిన తరువాత కోర్టులో తిరస్కరణకు గురికాకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల వివరాలు అడిగి తెసుకున్నారు. మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మరణాలు దర్యాప్తు చేసి వెంటనే కేసులను పూర్తి చేయాలన్నారు. సైబర్‌క్రైం, మర్డర్, యూఐ(అండర్ ఇన్‌వెస్టిగేషన్) పీటీ కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. రహదారి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీ మందా జావళి, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.